LIBRARY AND INFORMATION CENTRE

Public_advert

Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, 11 June 2019

June 11 || Today in History

 
🌽🌽🌽🌽🌽🌽🌽🌽
*చరిత్రలో ఈ రోజు/జూన్ 11*
🌽🌽🌽🌽🌽🌽🌽🌽

🌽🌽🌽🌽🌽
*సంఘటనలు*
🌽🌽🌽🌽🌽

🌽1866: ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడింది.

🌽1935: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించాడు.

🌽1963: బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు.

🌽1988: లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో నెల్సన్ మండేలా 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

🌽1988: ఐ.ఎన్.ఎస్. సింధువీర్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.

🌽1988: సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది

🌽1998: తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పోరేషనునుకొనుగోలు చేసింది.

🌽2001: ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్‌వీకు మరణశిక్ష అమలుపరిచారు.

🌽2010: 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలోప్రారంభమయ్యాయి.

🌽🌽🌽🌽
*జననాలు*
🌽🌽🌽🌽

🌽1920: మహేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (మ. 1972).

🌽1924: అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు మరియు రచయిత.(మ.2002)

🌽1932: ధారా రామనాథశాస్త్రి, సుప్రసిద్ధ నాట్యావధాని (మ.2016).

🌽1944: మేకపాటి రాజమోహన రెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

🌽1947: లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ రాజకీయ నాయకుడు.

🌽🌽🌽🌽
*మరణాలు*
🌽🌽🌽🌽

🌽1963: టాయ్ క్వాంగ్ డుచ్, దక్షిణ వియత్నాం బౌద్ధ భిక్షువు

🌽1979: జాన్ వెయిన్, హాలీవుడ్ నటుడు (జ.1907).

🌽1983: ఘనశ్యాం దాస్ బిర్లా, ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త. (జ.1894)

🌽1987: బి.ఎస్.మాధవరావు, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. (జ.1900)

🌽2001: ఓక్లహోమా, నిందితుడు టిమోతీ మెక్‌వీ.

🌽2013 : భారతదేశ మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నాయకుడు విద్యా చరణ్ శుక్లా మరణం.(జ.1929)

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages