మంచి సందేశం ఉన్న #కథ. ప్రతి ఒక్కరూ చదువగలరు....!!
ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు.అతను రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసేవాడు. ఒకరోజు వ్యాపారి తన గురువు దగ్గరకు వెళ్ళి"గురూజీ! నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి" అని కోరాడు.
అప్పుడు గురూజీ "నీ వ్యాపారంలో వృద్ధి చేకూరాలని"
దీవిస్తాడు.అలాగే "నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయితీగా వ్యవహరించు" అని హితువు చెప్తాడు.
ఎప్పుడు తుకంలో రైతులను మోసం చేసే ఆ వ్యాపారి
గురువుగారు చెప్పిన మాటలతో తన వైఖరిని
మార్చుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తాడు.
అతి తక్కువ సమయంలోనే అతని వ్యాపారం
బాగా వృద్ధి చెందుతుంది.వ్యాపారి బంగారు తుకపురాళ్లు చేయిస్తాడు. ఇలా అతని వ్యాపారం రెట్టింపు అయింది. ఒకరోజు ఆ తూకపు రాళ్లను తన గురువుగారి దగ్గరికి తీసుకెళ్లి చూపించి నమస్కరిస్తాడు. వాటిని గురువు గారు ఏటిలో పడవేయమంటాడు అతను అలానే చేస్తాడు.
ఒకరోజు కొంతమంది రైతులు తమ ధాన్యాన్ని అమ్మడానికి వ్యాపారి దగ్గరికి వస్తుంటారు, దారిలో ఏటిని దాటేటప్పుడు వాళ్ళకి బంగారు తూకపురాళ్లు
కనిపిస్తాయి.అవి వ్యాపరివేనని గుర్తిస్తారు. వ్యాపారి మంచితనం తెలిసిన రైతులు వాటిని దోచుకోడానికి ఇష్టపడరు.వాటిని తిరిగి అతనికి ఇచ్చేస్తారు.
అప్పుడు ఆ వ్యాపారి వాటిని తన గురువు దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తాడు. అప్పుడు గురువు "నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మనేశావో ...
దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు.నిజాయితీగా సంపాదించావు కనుకనే..
నీ సొమ్ము మళ్ళీ నీ దగ్గరకే చేరింది" అన్నాడు.....!!
నీతి : మనం నిజాయితీగా కష్టపడి పని చేస్తే,
ఫలితం తప్పకుండా మన దగ్గరకే వస్తుంది.
No comments:
Post a comment
Thanks for you Comment
Regards
GEC Library Team