నమ్మకమే జీవితం .....నమ్మకమే విజయానికి తొలి మెట్టు....!!
నమ్మకం ఇది మూడక్షరాల పదమే కానీ దాన్ని సంపాదించడానికి ఒక్కోసారి జీవితం సరిపోదు కానీ అదే నమ్మకాన్ని కోల్పోవడానికి క్షణం కూడా పట్టదు.నమ్మకమనేది మన జీవితంలో గమ్యం చేరుకోవడంలో ప్రధమ పాత్ర పోషిస్తుంది.ఆ నమ్మకమే మన చుట్టుా ఉన్న వాళ్ళతో బంధం విడిపోకుండా కూడా ఉండేలా చూస్తుంది.
ఎవరి మీదయైనా నమ్మకం కోల్పోతే ఎన్నటికీ తిరిగి అదే స్ధాయి నమ్మకం పొందడం కష్టం.అదే మన మీద మనం నమ్మకం కోల్పోతే మనం బ్రతకటమే కష్టం
అవుతుంది.
అవుతుంది.

మన జీవితంలో
విజయాన్ని సాదించడానికి సహాయపడే శక్తులలో మొదటిది ఆత్మ విశ్వాసం అదే మనకు మనపై ఉండే నమ్మకం.ఆ నమ్మకాన్ని మనం మరణించినా ముక్కలు కాకుండా ఉండేలా బ్రతకాలి......!
అప్పుడే నిజ జీవితంలో మనం ఏమైనా సాధించగలుగుతాము ....!!
No comments:
Post a comment