నేడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి 100 వ వర్ధంతి - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

నేడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి 100 వ వర్ధంతి

Share This

*ఆ రోజుల్లోనే మూఢ నమ్మకాల పై విరుచుకు పడ్డ కందుకూరి*

●ఆ మూఢనమ్మకాలా కాలంలో దెయ్యాలు, భూతాలు లేవంటూ వాదించేవాడు. తోటి వారితో సవాలు చేసి అర్ధరాత్రి, అమావాస్యనాడు శ్మశానానికి వెళ్లి తెల్లవారి మామూలుగానే వచ్చి ఒక్క దెయ్యం కూడా కనపడలేదని దెయ్యాల పేరుతో భయాలు అనవసరం అని ఆనాడే చాటి చెప్పాడు.

●వీరేశలింగానికి జబ్బు చేస్తే ఎవరో తన కుమారుడికి చేతబడి(మంత్రాలు) చేసారని భూతవైద్యుని పిలిపించి వైద్యం చేయించడానికి ప్రయత్నించింది ఆయన తల్లి.

ఆ భూత వైద్యుడిని వీరేశలింగం వివిధ ప్రశ్నలు వేయడంతో భయపడి పారి పోయాడు. ఇంటికి వెళ్లాక అనారోగ్యం పాలయ్యాడు.

పైగా వీరేశలింగం తనకే చేతబడి(మంత్రాలు) చేసాడని భయపడిపోయాడు. దీంతో వీరేశలింగం అతని ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి అతని ఆరోగ్యం కుదుటపర్చాడు.

●13 సంవత్సరాల లోపే అంటే రజస్వల అవ్వక ముందే వివాహాలు పూర్తి చేయాలనే సాంప్రదాయం వుండేది.

పసి బాలికలకు ముసలి వారితో వివాహాలు చేసే రోజులవి. భర్త చనిపోతే వితంతువులు మరలా పెళ్లి చేసుకోరాదనే మూఢాచారం అమలులో వున్న సాంఘిక పరిస్థితులలో కందుకూరి వీరేశలింగం వాటి ని రూపుమాపటానికి చాలా కృషి చేసారు.

●1872వ సంవత్సరంలో కోరంగిలో ఇంగ్లీషు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగం లభించింది. అప్పటికే ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చింది. మూఢ నమ్మకాలు, ఆచారాల మీద నమ్మకాలు మారిపోయాయి.

ఈ కోరంగి స్కూలులో చేరటానికి అమావాస్యనాడు వెళ్లే ముహూర్తం నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా భూమి, సూర్యుడు చుట్టు తిరగడం వల్ల ఏర్పడే సంవత్సరం లోని రోజులలో మంచి రోజులు, చెడు రోజులు అనే తేడాలు చూడడం మూఢత్వంగా చాటి చెప్పాడు.

●మెడలో జంధ్యాన్ని పీకి పారేసిన, అమావాస్యనాడు ఉద్యోగంలో చేరిన, దెయ్యాలు లేవని చెప్పడం కోసం నాడే తెగించి శ్మశానంలో రాత్రంతా గడిపి వచ్చిన, అగ్ర వర్ణాలకు మాత్రమే చదువు పరిమితంగా చెప్పే పంతుళ్ల స్థానంలో అందరికీ అందులోనూ ఆడపిల్లల కోసం స్కూలు ఏర్పాటు చేసిన వీరేశలింగం గారు చాలా కష్ట పడ్డారు.

మూఢనమ్మకాలను అధికంగా నమ్మే దేశం ఇండియా.మూఢ నమ్మకాలు అతి తక్కువగల దేశాలు చైనా,జపాన్ అందుకే ఆ దేశాలు అతి తొందరగా అభివృద్ధి చెందాయి.

కాబట్టి మూఢనమ్మకాలను-సాధ్యమయినంత వరకు అరికడదాం,ఇది మన బాధ్యత.

       

No comments:

Post a comment

Post Bottom Ad

College events Here

Pages